- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మణిరత్నం కొత్త మూవీ అప్డేట్ వచ్చేసింది
మణిరత్నం నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చింది. అందులో విజయ్ సేతుపతి, సాయి పల్లవి జంటగా కనిపించనుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న లెజెండరీ దర్శకుడు మణిరత్నం తదుపరి చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది. ఇందులో విజయ్ సేతుపతి, సాయి పల్లవి జంటగా నటించనున్నారు. మణిరత్నం సినిమా అంటే దాదాపుగా దానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుంటారు. ఈ క్రేజీ సినిమాకు కూడా ఆయనే సంగీతం అందించబోతున్నారు.
తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నట్లు ప్రకటించారు. మద్రాస్ టాకీస్ మరియు లైకా ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి. ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేయలేదు. దాంతో మద్రాస్ టాకీస్ ప్రొడక్షన్ నెంబర్ 23 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేశారు.
ఈ సినిమాను లవ్, రొమాంటిక్ డ్రామాగా రూపొందించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ 2026 సమ్మర్ నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మణిరత్నం కొంతకాలం క్రితం కమల్ హాసన్ తో 'థగ్ లైఫ్' అనే చిత్రాన్ని రూపొందించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. మరి ఈ సినిమాతో ఈయన విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి.






