- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేవిశ్రీప్రసాద్ 'గద్దలకొండ గణేష్' నుండి ఎందుకు తప్పుకున్నాడో తెలుసా?
హరీష్ శంకర్ మాట్లాడుతూ... 'గద్దల కొండ గణేష్'కి 'దేవిశ్రీప్రసాద్'ను సంగీత దర్శకుడిగా అనుకున్నాం. అందులో వెల్లువొచ్చి గోదారమ్మ సాంగ్ చేయాలి అనుకున్నాం. కానీ ఆయన రీమిక్స్ పాటలకి పని చేయను అనడంతో వెనక్కి తగ్గినట్లు చెప్పుకొచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: హరీష్ శంకర్ తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఆయన సంగీతం అందించిన కొన్ని పాటలను ఇప్పటికే విడుదల చేశారు. మార్చి 26న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మొదట మేకర్స్ ప్రకటించారు. ఆ తర్వాత ఓ వారం ముందుగానే అనగా మార్చి 19వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఈవెంట్లో దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన రీ రికార్డింగ్ పనులు జరుగుతున్నాయని, మూవీ అదిరిపోయిందని, ఈ సినిమాతో పవన్ గారికి మరో బ్లాక్ బాస్టర్ ఖచ్చితంగా వస్తుందని స్టేట్మెంట్ ఇచ్చాడు.
ఇలా అంతా సజావుగా జరుగుతున్న సమయంలో సడన్గా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నట్లు అనౌన్స్ చేసింది. దానితో 'దేవిశ్రీప్రసాద్'కి, మూవీ బృందానికి ఏమైనా చెడిందా? ఎందుకు ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు? ఇలా అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. తాజాగా హరీష్ శంకర్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఒక క్లారిటీ ఇచ్చాడు. తాము విడుదల తేదీని ముందుకు తీసుకు వచ్చామని, దానితో తమన్ ఈ సినిమాకు పనిచేస్తున్నాడని, అంతే తప్ప తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపాడు.
ఎంతో ఆనందకరమైన వాతావరణంలో ఈ సినిమాకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని చెప్పాడు. అలాగే తాను కొంతకాలం క్రితం గద్దల కొండ గణేష్ అనే చిత్రాన్ని రూపొందించానని, ఆ సినిమా స్టార్టింగ్ లో దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నట్లు వేశానని గుర్తు చేశాడు. కానీ ఆ చిత్రంలో వెల్లువొచ్చే గోదారమ్మ సాంగ్ను రీమేక్ చేయాలి అనుకున్నానని, కానీ ఆయన రీమేక్ పాటలకు తాను పనిచేయనన్నాడని తెలిపాడు. దానితో సారీ నీ పర్మిషన్ లేకుండా అలా వేశానని తాను వెనక్కు తగ్గానని చెప్పాడు. ఇలా తమ మధ్య చాలా ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుందని, దేనినైనా చాలా పాజిటివ్గా తీసుకుంటామని హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు.






