- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫిష్ వెంకట్ మృతిపై సినీ ప్రముఖులు సంతాపం
టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ (Fish Venkat) మృతిచెందాడు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ (Fish Venkat) మృతిచెందాడు. ఆయన గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. రెండు కిడ్నీలూ చెడిపోయాయని డయాలసిస్ కోసం దాతలు ఎవరైనా ఆర్థిక సాయం చేయాలని ఆయన కూతురు ఇటీవల మీడియా ముందు కోరగా, పలువరు ప్రముఖులు సాయానికి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇంతలో ఆయన మృతి చెందడం విచారకరం.
ఇక ఆయన మృతి పట్లు సిని ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ హరీశ్ శంకర్ 'మిస్ యూ అన్నా..' అంటూ పోస్ట్ పెట్టాడు.
కాగా, వెంకట్ వందకు పైగా చిత్రాల్లో హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీప్రియులను అలరించారు. ఆది, దిల్, బన్నీ, అత్తారింటికి దారేది, లక్ష్మీ, చెన్నకేశవరెడ్డి, గబ్బర్‌సింగ్, డీజే టిల్లు, కింగ్, డాన్ శీను, మిరపకాయ్, దరువు, సుప్రీమ్ తదితర హిట్ చిత్రాల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చివరి చిత్రం ‘కాఫీ విత్ ఏ కిల్లర్’.






