న్యూ ఇయర్ కానుక‌.. రేపు రిలీజ్ అయ్యే సినిమాలివే

by velandi.Saikiran |

సైక్ సిద్ధార్థ ( Psych Siddhartha ) సినిమా వస్తోంది. దీంతో ఈ సినిమా బంపర్ హిట్ అవుతుందని అందరూ అంచనా వేస్తున్నారు.

న్యూ ఇయర్ కానుక‌.. రేపు రిలీజ్ అయ్యే సినిమాలివే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ ఇండస్ట్రీలో రకరకాల మూవీలు వస్తున్నాయి. ఇందులో కొన్ని సినిమాలు బాగా ఆడుతున్న నేపథ్యంలో మరికొన్ని సినిమాలు మాత్రం పెద్దగా ఆకట్టుకోవడం లేదు. అలా చాలా సినిమాలు డిజాస్టర్ గా మిగిలిపోతున్నాయి. అయితే 2026 కొత్త సంవత్సరం వస్తున్న నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు కొత్త, కొత్త కథలతో సినిమాలు వస్తున్నాయి. అలాంటి వాటిలో సైక్ సిద్ధార్థ ( Psych Siddhartha ) లాంటి మూవీలు ముందు వరుసలో ఉన్నాయి.

జ‌న‌వ‌రిలో అదిరిపోయే సినిమాలు

సైకో కిల్లర్ చుట్టూ తిరిగే ఉత్కంఠ భరితమైన మిస్టరీ స్టోరీగా ఈ సైక్ సిద్ధార్థ ( Psych Siddhartha ) సినిమా వస్తోంది. దీంతో ఈ సినిమా బంపర్ హిట్ అవుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. అవినాష్, సిమ్రాన్ చౌదరి, నందు ప్రధాన పాత్రలో నటించిన వనవీర సినిమా కూడా జనవరి ఒకటో తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమా ఓ పిరియాడిక్ యాక్షన్ డ్రామా. కర్ణాటక కు చెందిన శివరాజ్ కుమార్, ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటించిన 45 సినిమా కూడా రేపే రిలీజ్ కానుంది.

ఈ మూవీ సైంటిఫిక్ థ్రిల్లర్, యాక్షన్ ఎంటర్టైనర్ కావడం విశేషం. ఈ సినిమాను కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం అలాగే హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇక అటు కిచ్చ సుదీప్ నటించిన మార్క్ సినిమా కూడా కొత్త సంవత్సరంలో రిలీజ్ కాబోతోంది. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీ తెలుగు, కన్నడ తో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ కానుంది. ఇలాంటి నేపథ్యంలో కొత్త సంవత్సరంలో ఏ సినిమా సక్సెస్ అవుతుందో అని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Next Story