- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆదర్శ కుటుంబంలో అదే మెయిన్ హైలైట్.. వెంకటేష్ సినిమాపై అప్డేట్
విక్టరీ వెంకటేశ్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శకుటుంబంలో’ ప్రీ-క్లైమాక్స్‌లో వచ్చే స్పెషల్ కామెడీ ఎపిసోడ్ ప్రధాన హైలైట్‌గా నిలవనుందని సమాచారం.

దిశ, సినిమా: విక్టరీ వెంకటేశ్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్ చిత్రం ‘ఆదర్శకుటుంబం’. చాలా కాలం తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ మూవీని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాయి. అనౌన్స్‌మెంట్ నుంచే ఈ చిత్రంపై సూపర్ బజ్ క్రియేట్ కాగా.. సమ్మర్ స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ మేరకు సైలెంట్‌గా షూటింగ్ కూడా కానిచ్చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ మేరకు ‘‘ఆదర్శకుటుంబం’లో ప్రీ-క్లైమాక్స్‌లో వచ్చే స్పెషల్ కామెడీ ఎపిసోడ్ ప్రధాన హైలైట్‌గా నిలవనుందని సమాచారం. వెంకీ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ కలిసి మళ్లీ నవ్వుల పండుగ తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక త్రివిక్రమ్ మార్క్ రైటింగ్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఈ సినిమాకు బలం కానున్నాయి. సమ్మర్ రిలీజ్ టార్గెట్ చేస్తూ, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు’ అంటూ ఓ పోస్ట్ వైరల్ కాగా.. వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.






