‘వామ్మో ఆ రొమాన్స్ ఏంట్రా బాబూ.. నాకే భయమేసింది’: కొత్త సినిమా టీజర్ విడుదల

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-03 14:45:02  IST  )

నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న అగ్లీ స్టోరీ సినిమా టీజర్(Ugly Story Movie Teaser) విడుదల అయింది.

‘వామ్మో ఆ రొమాన్స్ ఏంట్రా బాబూ.. నాకే భయమేసింది’: కొత్త సినిమా టీజర్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న అగ్లీ స్టోరీ సినిమా టీజర్(Ugly Story Movie Teaser) విడుదల అయింది. ఈ టీజర్‌ అన్ని రకాల ప్రేక్షకులను కట్టి పడేసింది. నందు(Nandu), అవికా గోర్(Avika Gor) నటన ఒక ఎత్తయితే.. సినిమాలో రొమాన్స్ మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రణవ స్వరూప్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రియా జియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సీహెచ్ సుభాషిణి, కొండా లక్ష్మణ్ నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్స్ రిలీజై ప్రేక్షకుల్లో హైప్ పెంచాయి. తాజాగా ఈ చిత్రంపై పబ్లిక్ స్టా్ర్ బండి సరోజ్ కుమార్ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు. ‘‘ఈ సినిమా 2023లో ప్రణవ స్వరూప్‌ నా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు చాలా భయపడ్డాను. ముఖ్యంగా ఆ వైల్డ్ రొమాన్స్. మాటలు, ఫైట్స్ అంటే ఓకే కానీ రొమాన్స్ అంటే నాకు చాలా సిగ్గు, భయం. అదీ ఇదీ సాకులు చెప్పి ఏదోలా మొత్తానికి బయటకు వచ్చేశా. ఇప్పుడు టీజర్ చూసాక నాకు చాలా సంతోషంగా ఉంది. నందు ఇరగదీశాడు. మొత్తం చిత్రబృందానికి అభినందనలు’’ అని సరోజ్ కుమార్ ట్వీట్ చేశారు. వీడియో

Next Story