‘మాకు డ్రగ్స్ అవసరం లేదు.. ఆయన బొమ్మ చాలు’.. నెట్టింట వైరల్‌గా మారిన కొత్త సినిమా సీన్స్

by Gantepaka Srikanth |

తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌(Power Star Pawan Kalyan)కు లక్షల్లో అభిమానులు ఉన్నారు.

‘మాకు డ్రగ్స్ అవసరం లేదు.. ఆయన బొమ్మ చాలు’.. నెట్టింట వైరల్‌గా మారిన కొత్త సినిమా సీన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌(Power Star Pawan Kalyan)కు లక్షల్లో అభిమానులు ఉన్నారు. సాధారణ యువకులే కాకుండా.. ఇండస్ట్రీలో ఉన్న యువ హీరోల్లో చాలా మంది ఆయన ఫ్యాన్సే ఉన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు ఆ హీరోలే చెప్పడం మనం చూశాం. ఇక ఇప్పటికే నితిన్, కిరణ్ అబ్బవరం, సాయిదుర్గతేజ్, రామ్ పోతినేని, నాని వంటి అనేక మంది యువ హీరోలు వారి వారి సినిమాల్లో పవన్ కల్యాణ్ రెఫరెన్స్ ఉండేలా చూసుకుంటారు. పవన్ కల్యాణ్ పాటలు, డైలాగులు, మేనరిజం వంటివి అక్కడక్కడ చూపిస్తూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ను ఉత్సాహ పరిచే ప్రయత్నం చేస్తున్నారు.


అచ్చం అలాగే మరో సినిమాలో పవన్ కల్యాణ్ రెఫరెన్స్‌(Pawan Kalyan Reference)ను వాడారు. కానీ.. ఈసారి కాస్త వెరైటీగా ట్రై చేశారు. ఇవాళ విడుదలైన మ్యాడ్ స్కైర్ సినిమా(Mad Square Movie)లో ముగ్గురు హీరోల ఎంట్రీకి ముందే.. పవన్ కల్యాణ్ ఫొటో ఉన్న ఆటో కనిపిస్తుంది. ఆ ఫొటోపై ‘మాకు డ్రగ్స్ అవసరం లేదు.. మాకు పవర్ స్టార్ ఉన్నారు’.. ఆయన్ను తెర మీద చూస్తే వచ్చే కిక్కు.. ఎన్ని డ్రగ్స్ తీసుకున్నా రాదు’ అనే కోణంలో పేర్కొన్నారు. అయితే సినిమాకు వెళ్లిన అభిమానులంతా ఈ విజువల్స్‌ను ఫోన్ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అవి కాస్త వైరల్‌గా మారింది.

కాగా, మ్యాడ్ స్వైర్ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sithara Entertainments) అధినేత సూర్యదేవర నాగ‌వంశీ(Suryadevara Naga Vamsi) నిర్మించారు. మ్యాడ్ సినిమా(Mad Movie)కు సీక్వెల్‌గా ఈ చిత్రం రాగా.. మొద‌టి పార్ట్‌లో న‌టించిన జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్‌తో పాటు త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమాకు క‌ళ్యాణ్ శంక‌ర్(Kalyan Shankar) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్రస్తుతం ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో అదరగొడుతోంది.

Next Story