- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vijay Sethupathi: విజయ్ సేతుపతి చేతులమీదుగా సినిమా లాంచ్.. రేపే ఫస్ట్ లుక్ పోస్టర్
తమిళ (Tamil) నటుడు విమల్ (Vimal) ‘కలకలప్పు’ అనే చిత్రంతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు.

దిశ, సినిమా: తమిళ (Tamil) నటుడు విమల్ (Vimal) ‘కలకలప్పు’ అనే చిత్రంతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు మూవీస్‌లో నటించినప్పటికీ.. ‘కాంచీవరం’ సినిమాతో నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే నటన పరంగా పర్వాలేదు అనిపించుకుని.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. గతేడాది ‘పోగుమిడం వేగు తూరమిల్లై’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన.. ఈ ఏడాది ‘ఓం కాళీ జై కాళీ’ చిత్రంతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీ ప్రజెంట్ జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతూ.. ప్రేక్షకాదరణ పొందుతోంది.
ఇప్పుడు ఈ హీరో సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. నటుడు విమల్ నెక్ట్స్ ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో థియేటర్‌లలో సందడి చేయనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ & ఫస్ట్ లుక్‌ను ఏప్రిల్ 14న ఉదయం 11 గంటలకు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. కాగా.. విమల్ నటిస్తున్న ఈ లేటెస్ట్ మూవీకి మజిత్ దర్శకత్వం వహిస్తుండగా.. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలపనున్నారు మేకర్స్.
#ActorVemal is back with a family entertainer.....Title & firstlook will be Revealed by Makkal Selvan @VijaySethuOffl Tomorrow April 14th 2025 at 11 AM
— Touring Talkies (@ToouringTalkies) April 13, 2025
Directed By @directormajith@champikaoffl @iYogiBabu #MottaRajendran #MSBhaskar #PowerStarSrinivasan #JohnVijay #RaviMaria… pic.twitter.com/GKQBGxvlNO






