టాలీవుడ్‌లో కొత్త బ్యానర్

by Sujitha Rachapalli |

టాలీవుడ్‌లోకి మరో చిత్ర నిర్మాణ సంస్థ రాబోతోంది. సమాజానికి ఉపయోగపడే అంశాలు, సామాజిక రుగ్మతలు, నేరాలపై యువతకు అవగాహన కల్పించేలా సినిమాలు తీయబోతున్నట్లు నిర్మాత అతీకూర్ రెహమాన్ తెలిపారు. ‘ఆర్ ఎక్స్‌ప్లోర్ మూవీస్’ పేరుతో

టాలీవుడ్‌లో కొత్త బ్యానర్
X

దిశ, సినిమా : టాలీవుడ్‌లోకి మరో చిత్ర నిర్మాణ సంస్థ రాబోతోంది. సమాజానికి ఉపయోగపడే అంశాలు, సామాజిక రుగ్మతలు, నేరాలపై యువతకు అవగాహన కల్పించేలా సినిమాలు తీయబోతున్నట్లు నిర్మాత అతీకూర్ రెహమాన్ తెలిపారు. ‘ఆర్ ఎక్స్‌ప్లోర్ మూవీస్’ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభిస్తున్నామని.. ఇందుకు సంబంధించిన బ్యానర్‌ను లాంచ్ చేశారు. సమాజంలో మనమంతా ఎన్నో సమస్యలు చూస్తున్నామని.. చైల్డ్ ట్రాఫికింగ్, డ్రగ్స్, ఉమెన్ ట్రాఫికింగ్, సోషల్ మీడియా ఫ్రాడ్స్..ఇలా ఎన్నో సమస్యల్లో చిక్కుకుని మన యువత దారి తప్పుతున్నారని.. వారిని అప్రమత్తం చేసేలా, కాన్సెప్ట్‌లు ఎంచుకుంటామని చెప్పారు. ఇక ఈ కార్యక్రమానికి మహతి, డాక్టర్ సత్యవతి, అరుణ తదితరులు హాజరయ్యారు.

Next Story