- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్‌కు అన్నగా నటించబోతున్న స్టార్ నటుడు.. సందీప్ రెడ్డి వంగా ప్లాన్ అదిరిందిగా అంటున్న నెటిజన్లు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) కల్కి-2, సలార్-2(Salar-2), ఫౌజి, వంటి భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) కల్కి-2, సలార్-2(Salar-2), ఫౌజి,రాజాసాబ్ వంటి భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga), ప్రభాస్ కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘స్పిరిట్’(Spirit). అందరి చూపు ఈ సినిమాపైనే ఉందనడంతో అతిశయోక్తి లేదు. అయితే ఈ మూవీ ప్రకటన విడుదల చేశారు కానీ షూటింగ్ మాత్రం మొదలుపెట్టలేదు. దీంతో ‘స్పిరిట్’ చిత్రానికి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
మొదటి సారి ప్రభాస్ పోలీస్‌గా నటిస్తుండటం విశేషం. ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని డార్లింగ్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అయితే స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయినట్లు ఉగాది నాడు షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు పలు పోస్టులు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఆరోజు అయితే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘స్పిరిట్’చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాక్. స్పిరిట్ స్టోరీని ఆయనకు సందీప్ రెడ్డి వంగా వివరించగా.. దానికి ఆయన కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ పోస్టులు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు సందీప్ రెడ్డి వంగా ప్లాన్ అదిరిందని అంటున్నారు.






