- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇదెక్కడి పైత్యం రా.. సినిమా చూడాలా మిమ్మల్ని చూడాలా?
ఇంట్లో టీవీ ఉన్నా థియేటర్‌లో సినిమా చూస్తే ఆ కిక్కేవేరు. థియేటర్‌లో బిగ్ స్క్రీన్, మంచి సౌండ్ సిస్టమ్ ఉండటంతో సినిమా విడుదలైన వెంటనే దానిని థియేటర్‌లోనే చూడాలని అనుకుంటారు.

దిశ, వెబ్ డెస్క్: ఇంట్లో టీవీ ఉన్నా థియేటర్‌లో సినిమా చూస్తే ఆ కిక్కేవేరు. థియేటర్‌లో బిగ్ స్క్రీన్, మంచి సౌండ్ సిస్టమ్ ఉండటంతో సినిమా విడుదలైన వెంటనే దానిని థియేటర్‌లోనే చూడాలని అనుకుంటారు. ఇక ఈ మధ్య రీరిలీజ్ సినిమాలు కూడా పెరిగిపోయాయి. ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలు అన్నీ మళ్లీ థియేటర్లలో విడుదలవుతున్నాయి. దీంతో అప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అయిన అభిమానులు, మూవీ లవర్స్ రీరిలీజ్ లకు సైతం థియేటర్లకు వెళ్లి సినిమాలు చూస్తున్నారు. కొత్త సినిమా అయినా, రీరిలీజ్ అయినా ఇలా థియేటర్‌లోనే చూస్తారు.
అయితే ఈ మధ్య సినిమాలు చూడటం ఏమోగానీ ఆ సినిమా చూడ్డానికి వచ్చిన ప్రేక్షకులే థియేటర్ మధ్యలో, స్కీన్ దగ్గర నిలబడి పర్ఫామెన్స్ లు ఇస్తున్నారు. ఫేమస్ అవ్వడానికో, సోషల్ మీడియా ఫాలోవర్ల కోసమో కానీ ప్రేక్షకులను మాత్రం డిస్టబ్ చేస్తున్నారు. అసలే టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. థియేటర్ కు రావాలంటేనే జనాలు భయపడిపోతున్నారు. ఇలాంటి సమయంలో అధిక ధరకు టికెట్ కొనుగోలు చేసిన ప్రేక్షకులకు సైతం మధ్యలో ఇచ్చే పర్ఫామెన్స్ లతో ఇబ్బంది కలుగుతోంది.
ఒకటి రెండు సినిమాలు అని కాకుండా ఏ సినిమా వచ్చినా సోషల్ స్టార్స్ అవ్వాలనుకునేవాళ్లు తమ పైత్యం అంతా బయటపెడుతున్నారు. ఇక మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటించిన అతడు సినిమా రీరిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని బ్రహ్మానందం సీన్ కూడా ఓంట రీక్రియేట్ చేసింది. ఇది వరకు పాటలకు మాత్రమే ఇలాంటి పర్ఫామెన్స్‌లు ఇవ్వగా ఇప్పుడు సన్నివేశాల మధ్యలోనూ టాలెంట్ చూపించడంతో ప్రేక్షకులకు ఇరిటేషన్ వస్తోంది. దీనికి సంబంధిచిన వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు సైతం ఇక ఆపండ్రా బాబూ.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. video






