పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర హీరోయిన్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

by Gugulothu.Kavitha |

బిగ్ బాస్(Bigg Boss) కంటెస్టెంట్, పాపులర్ బుల్లితెర మెరీనా(Merina) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర హీరోయిన్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్(Bigg Boss) కంటెస్టెంట్, పాపులర్ బుల్లితెర మెరీనా(Merina) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. 'అమెరికా అమ్మాయి'(America Ammayi) అనే సీరియల్‌తో పాపులర్ అయిన ఈ చిన్నది ఆ తర్వాత ఈ అమ్మడు 'ఉయ్యాల జంపాల' ధారావాహికతో మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. కేవలం సీరియల్స్ మాత్రమే కాదు, వాటి ద్వారా వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్‌తో సినిమాల్లో కూడా అవకాశాన్ని దక్కించుకుంది. 'రొమాన్స్ విత్ ఫైనాన్స్' అనే సినిమాతో వెండితెరపై మెరిసింది మెరీనా. అలాగే 'సబ్కా దిల్ ఖుషి' అనే హిందీ సినిమాలో కూడా ఈ అమ్మడు నటించింది. ఇక ఈ భామ వ్యక్తిగత విషయానికి వస్తే.. సీరియల్ నటుడు రోహిత్ సాహ్నిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

అయితే ప్రముఖ బుల్లితెర కపుల్ మెరీనా అబ్రహం - రోహిత్ సాహ్నీ పేరెంట్స్ కాబోతున్నట్లు రీసెంట్‌గా సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మెరీనా పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న వీడియోలో మెరీనా, రోహిత్ జంట ఒక ఇంటికి గెస్టుగా వచ్చారు. అయితే మెరీనా తన చేతిలో ఓ పాపను ఎత్తుకున్నది. దీంతో అసలు డెలివరీ ఎప్పుడు అయిందని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే మరికొంత మంది ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

Next Story