బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన శ్రీలీల.. ఆ లుక్‌లో కనిపించడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్ల..

by Gugulothu.Kavitha |

‘పెళ్లి సందడి’(Pelli Sandadi) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ శ్రీ లీల(Sree Leela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన శ్రీలీల.. ఆ లుక్‌లో కనిపించడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్ల..
X

దిశ, వెబ్‌డెస్క్: ‘పెళ్లి సందడి’(Pelli Sandadi) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ శ్రీ లీల(Sree Leela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది ఈ భామ. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక ఈ అమ్మడు డ్యాన్స్‌కి అయితే ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. రవితేజ(Raviteja) ‘మాస్ జాతర’, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటిస్తున్న ‘VD-12’, శివ కార్తికేయన్(Sivakarthikeyan) ‘పరాశక్తి’(Parasakthi) మూవీతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్(Ibrahim Ali Khan) సరసన ఓ హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది.

అలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ చదువులోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన పై చదువులు పూర్తి చేసుకుంటుంది. అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియా(social Media)లోనూ నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు హీట్ పుట్టిస్తోంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా శ్రీలీల తన ఇన్‌స్టా(Instagram) వేదికగా ఓ స్టోరీ పెట్టింది.

అందులో పెళ్లి కూతురులాగా బుగ్గకు చుక్క చేతులకు గోరింటాకు, సవరంతో పాటు మేకప్‌ కూడా పెళ్లి కూతురిలా చేసుకుని రెడీ అయింది. ఇక ఆ క్యూట్ ఫొటోకు ‘షూటింగ్ కోసం మాత్రమే’ అని క్యాప్షన్ కూడా జోడించింది. దీంతో ఈ స్టోరీ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు షూటింగ్ సర్‌ప్రైజ్ ఇవ్వడంతో కంగ్రాట్స్ చెబుతున్నారు.


Next Story