- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండో సారి తల్లి కాబోతున్న హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోస్ షేర్ చేయడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
టాలీవుడ్ హీరోయిన్ పూర్ణ(Purna) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ పూర్ణ(Purna) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో మంచి మంచి సినిమాల్లో హీరోయిన్‌గా అలరించిన ఈ చిన్నది.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ బిజీగా ఉంటోంది. ఇందులో భాగంగా రీసెంట్‌గా బాలయ్య నటించిన ‘అఖండ 2 తాండవం’(Akhanda-2 thandavam) సినిమాలో ఓ కీలక పాత్రలో మెరిసింది. మరోపక్క పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లోనూ సందడి చేస్తోంది.
ఇక ఈ భామ వ్యక్తిగత విషయానికి వస్తే.. మూడేళ్ల క్రితం దుబాయికి చెందిన షనిద్ ఆసిఫ్(Shanid Ashif) అనే బిజినెస్‌మ్యాన్‌ని రహస్యంగా పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. అయితే త్వరలోనే ముద్దుగుమ్మ రెండోసారి తల్లిగా ప్రమోషన్ పొందనుంది. కొన్ని రోజుల క్రితమే ఈ శుభవార్తను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ చిన్నది. ఈ క్రమంలో తాజాగా బేబీ బంప్‌తో తీసుకున్న ఫొటోలను ఇన్ స్టా గ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వీటిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.






