తండ్రి కాబోతున్న బిగ్ బాస్ నటుడు.. భార్య సీమంతం వీడియో షేర్ చేయడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

by I. Sairam |   (  Updated:2025-07-20 07:45:52  IST  )

బిగ్ బాస్ నటుడు ఆదిరెడ్డి(Adireddy) మనందరికీ సుపరిచితమే.

తండ్రి కాబోతున్న బిగ్ బాస్ నటుడు.. భార్య సీమంతం వీడియో షేర్ చేయడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ నటుడు ఆదిరెడ్డి(Adireddy) మనందరికీ సుపరిచితమే. ఆయన స్టార్టింగ్‌లో యూట్యూబ్‌లో బిగ్ బాస్(Bigg Boss) షోకి రివ్యూస్ ఇస్తుండేవాడు. అలా తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో బిగ్ బాస్ తెలుగు సీజన్‌లో కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చిన అతను తన ఆట, మాట తీరుతో బుల్లితెర ప్రేక్షకులను బాగానే అలరించాడు. ఫైనల్ వరకు వెళ్లినప్పటికీ విన్నర్ కాలేకపోయాడు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక కూడా తన దైన శైలిలో రివ్యూలు ఇస్తున్నాడు. బిగ్ బాస్‌తో పాటు అప్పుడప్పుడు సినిమాలపైనా తన అభిప్రాయాలు చెబుతున్నాడు. అలాగే కొన్ని టీవీ షోల్లోనూ సందడి చేస్తున్నాడు.

ఇక అతని వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆదిరెడ్డి కవితా అనే అమ్మాయిని 2020లో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ జంటకు ఇప్పటికే ఓ పాప ఉండగా.. తాను రెండోసారి తండ్రి కాబోతున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం అతని భార్య కవిత గర్భంతో ఉంది. తాజాగా ఆమెకు గ్రాండ్‌గా సీమంతం కూడా నిర్వహించాడు. ఈ వేడుకలో కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, స్నేహితులు కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న ఆది రెడ్డి.. ‘ నా సీతా సీమంతం’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు, సెలబ్రిటీలు ఈ జంటకు కంగ్రాట్స్ అని సేఫ్ డెలివరీ అవ్వాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story