Hero Rana: పాడె మోసిన హీరో రానా.. బంధాలకు ఎవరైనా సరే తల వంచాల్సిందే అంటూ నెటిజ‌న్ల కామెంట్స్

by Phanindra |

పాడే మోస్తున్న రానా ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి

Hero Rana: పాడె మోసిన హీరో రానా.. బంధాలకు ఎవరైనా సరే తల వంచాల్సిందే అంటూ నెటిజ‌న్ల కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్ : సినీ న‌టుడు దగ్గుపాటి రానా ( Rana Daggubati ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, అతని కుటుంబంలో విషాదం నెల‌కొంది. తణుకు మాజీ ఎమ్మెల్యే, దివంగత వైటీ రాజా తల్లి, ప్రముఖ పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణరావు చౌదరి భార్య రాజేశ్వరి దేవి ( Rajeswari Devi ) క‌న్నుమూశారు. గత కొన్ని నెలల నుంచి ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. అయితే, రాజేశ్వరి దేవి అంత్య క్రియ‌ల‌ను బుధ‌వారం సొంతూరు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని త‌ణుకులో నిర్వ‌హించారు.

ఈ అంతిమ యాత్ర‌లో సినీ నిర్మాత సురేష్‌ ( Daggubati Suresh Babu ) , న‌టుడు రానా పాల్గొన్నారు. రానాకు రాజేశ్వరి దేవి సొంత అమ్మ‌మ్మ అవుతారు. ఈ నేపథ్యంలోనే ఆయ‌న తన అమ్మ‌మ్మ పాడె మోశారు. నిర్మాత సురేశ్ స్వయానా ఆమెకు అల్లుడు. అమ్మమ్మ పాడే మోస్తున్న రానా ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఈ ఫోటోలపై స్పందించిన నెటిజన్స్ " కామన్ మ్యాన్స్ నుంచి సెలబ్రిటీల వరకు ఎవరైనా సరే బంధాలకు, బంధుత్వాలకు తల వంచాల్సిందే " అంటూ ఎమోషనల్ గా కామెంట్లు పెడుతున్నారు. ఆమె భౌతిక‌కాయానికి సినీ నటులు, రాజ‌కీయ ప్ర‌ముఖులు నివాళులు అర్పించారు.

ఇక రానా సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఇతను " లీడ‌ర్ " ( Leader ) మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ బాష‌ల్లో కూడా న‌టిస్తూ ఆడియెన్స్ ను అల‌రిస్తున్నారు. ముఖ్యంగా, బాహుబ‌లి పార్ట్ 1, పార్ట్ 2 లో భ‌ల్లాల దేవ పాత్ర‌తో వరల్డ్ వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీసులు, టాక్‌షోలు చేస్తూ ప్రేక్ష‌కుల‌కు దగ్గరగా ఉంటారు. అలాగే, కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేయడంలో రానా ముందుంటారు. 2020 ఆగ‌స్టు 8న మిహికా బ‌జాజ్‌ను పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు.

Next Story