ట్రెడిషనల్ లుక్‌లో స్టార్ హీరోయిన్.. బ్యూటిఫుల్ అంటూ నెటిజన్ల కామెంట్స్

by Gugulothu.Kavitha |

మహానటి కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

ట్రెడిషనల్ లుక్‌లో స్టార్ హీరోయిన్.. బ్యూటిఫుల్ అంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మహానటి కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ‘నేను లోకల్’(Nenu Local) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఇక ‘దసరా’(Dasara), ‘మహానటి’(Mahanati) సినిమాలతో అవార్డులు కూడా తెచ్చుకుని స్టార్ హీరోయిన్‌గా ఫేమ్ తెచ్చుకుంది. అలాగే ‘బేబీ జాన్’(Baby Jahn) సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. బట్ ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేక పోయింది.

ఇక ఆమె వ్యక్తిగత విషయానికి వస్తే.. రీసెంట్‌గా తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తటిల్‌(Antony Thattil)తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్‌ను తెగ ఎంజాయ్ చేస్తుంది. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. అలాగే వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఈ చిన్నదానికి సంబంధించిన కొన్ని పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

అందులో కీర్తి చాలా ట్రెడిషనల్‌గా కనిపించింది. చీరలో మహాలక్ష్మిలా అనిపించింది. దీపాన్ని వెలిగిస్తే తెలుగింటి ఆడపడుచులా నవ్వుతూ దర్శనమిచ్చింది. అలాగే మరో ఫొటోలో హెయిర్ లీవ్ చేసుకుని పాపిడి బిల్ల పెట్టుకొని పెద్ద పెద్ద ఇయర్స్ రింగ్స్ పెట్టుకుని చాలా సింపుల్‌గా ఉన్నప్పటికి అందంగా కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారగా వీటిని చూసిన నెటిజన్లు బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story