ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మెగాస్టార్.. మంచి మనసున్న మారాజంటూ నెటిజన్స్ కామెంట్స్(వీడియో)

by Gugulothu.Kavitha |   (  Updated:2026-01-10 06:55:53  IST  )

జీ తెలుగులో ప్రసార మయ్యే సరిగమప లిటిల్ ఛాంప్స్ షో అందరికీ తెలిసిందే.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మెగాస్టార్.. మంచి మనసున్న మారాజంటూ నెటిజన్స్ కామెంట్స్(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: జీ తెలుగులో ప్రసార మయ్యే సరిగమప లిటిల్ ఛాంప్స్ షో అందరికీ తెలిసిందే. అయితే ఆ కాంపిటీషన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ వరుణవి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ పాపకు కళ్లు లేనప్పటికీ తన గాత్రంతో అందరినీ ఫిదా చేస్తుంది. తన స్వీట్ వాయిస్‌తో అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. అయితే ఈ చిన్నారికి సీజన్ ఎండింగ్ వరకు ఎలిమినేషన్ లేకుండా పాడే చాన్స్ ఇవ్వడం విశేషం. ఇక సరిగమప లిటిల్ ఛాంప్స్ షోకు డైరెక్టర్ అనిల్ రావిపూడి, సింగర్ శైలజ, అనంత్ శ్రీరామ్ జడ్జీలుగా వ్యవహరిస్తుండగా.. సుధీర్ యాంకరింగ్ చేస్తున్నాడు.

అయితే రీసెంట్‌గా టెలికాస్ట్ అయిన ప్రోమోలో వరుణవిను చిరంజీవితో మీట్ అయ్యో చాన్స్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కల్పించిన సంగతి తెలిసిందే. అప్పుడు చిరు ఈ పాపను ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఆమెకు నా నుంచి ఎటువంటి సహాయం చేయడానికి అయినా రెడీ అని మాట ఇస్తాడు. ఇక ఇచ్చిన మాటను తాజాగా చిరంజీవి నిలబెట్టుకున్నాడు. సరిగమప లిటిల్ ఛాంప్స్ లేటెస్ట్ సీజన్ గ్రాండ్ ఫినాలేకు చిరంజీవి కూతురు సుస్మిత హాజరైంది.

ఇదే సందర్భంగా ఆమె చేతుల మీదుగా వరుణవి ఫ్యామిలీకి రూ.5 లక్షల చెక్కును ఇప్పించారు చిరంజీవి. మెగాస్టార్ పంపించిన డబ్బును వరుణవి పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయబోతున్నట్లు సుస్మిత తెలిపారు. ఇక ఇచ్చిన మాట ప్రకారం తన కూతురు చేతుల మీదుగానే ఈ బహుమతిని చిరంజీవి పంపించారని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో జీ తెలుగు తాజాగా రిలీజ్ చేసింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు మనసున్న మారాజు మా చిరంజీవి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read More..

సరిగమప వరుణవితో మెగాస్టార్.. వైరల్ అవుతున్న ప్రోమో.. చూస్తే మీరు కూడా ఫిదా అవుతారు


Next Story