మద్యం అలవాటు అని నెట్టింట ట్రోల్స్.. సందర్భాన్ని పట్టించుకోరా అంటూ జాన్వీకపూర్ ఫైర్

by Chukka Sudharani |   (  Updated:2026-05-04 12:50:11  IST  )

గతంలో ఒక బాధాకరమైన సంఘటన ఎదురైనప్పుడు దాని నుంచి బయట పడేందుకు మద్యం సేవించాను అని జాన్వీ కపూర్ వెల్లడించింది.

మద్యం అలవాటు అని నెట్టింట ట్రోల్స్.. సందర్భాన్ని పట్టించుకోరా అంటూ జాన్వీకపూర్ ఫైర్
X

దిశ, సినిమా: సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అంటుంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. రీసెంట్‌గా మానసిక ఆరోగ్యం, వ్యసనాలపై అవగాహన కల్పించే ‘ఆఫ్ ది రాక్స్’ అనే పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఈ హీరోయిన్.. గతంలో ఒక బాధాకరమైన సంఘటన ఎదురైనప్పుడు దాని నుంచి బయట పడేందుకు మద్యం సేవించాను అని, మళ్లీ ఆ అలవాటు నుంచి బయట పడేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది అంటూ యువతకు అవగాహన కల్పించే విధంగా చెప్పింది. అయితే.. అందులో మద్యం తాగింది అనే మాటను పట్టుకుని చాలా మంది అసహ్యంగా ట్రోల్స్ చేశారు. దీనిపై రీసెంట్‌గా జాన్వీ కపూర్ టీమ్ స్పందిస్తూ.. ‘ఆమె మాటల వెనుక ఉన్న సందర్భాన్ని వదిలేసి, కేవలం జాన్వీకి మద్యం అలవాటు ఉందనే కోణంలో వార్తలను వైరల్ చేయడం ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉందని, వాస్తవాలను తెలుసుకోకుండా వార్తలు రాయడం కరెక్ట్ కాదని’ తెలిపారు. అలాగే జాన్వీకపూర్ స్పందిస్తూ.. ‘ఏదైనా విషయాన్ని వైరల్ చేసే ముందు దాని వెనుక ఉన్న వాస్తవాలను, సందర్భాన్ని అర్థం చేసుకోవాలి. కేవలం రేటింగ్స్ కోసం వ్యక్తిగత జీవితాలను తప్పుగా చూపొద్దు’ అంటూ ఫైర్ అయింది.

విజయ్ - త్రిష జోడీపై దివ్వెల దివ్వెల మాధురి ఇన్‌స్టా పోస్ట్.. నెక్ట్స్ గెలుపు మీదే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్!

Next Story