విజయ్ - త్రిష జోడీపై దివ్వెల దివ్వెల మాధురి ఇన్‌స్టా పోస్ట్.. నెక్ట్స్ గెలుపు మీదే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్!

by Gantepaka Srikanth |

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ సాధించిన విజయాలపై ఏపీకి చెందిన దివ్వెల మాధురి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

విజయ్ - త్రిష జోడీపై దివ్వెల దివ్వెల మాధురి ఇన్‌స్టా పోస్ట్.. నెక్ట్స్ గెలుపు మీదే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ సాధించిన విజయాలపై ఏపీకి చెందిన దివ్వెల మాధురి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. విజయ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూనే, వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శలకు ఆమె తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఫలితాలపై తన ఇన్‌స్టా స్టోరీలో స్పందిస్తూ.. "నటి త్రిష కోరికతో పాటు, విజయ్ గెలవాలనే నా కోరిక కూడా నెరవేరింది. కంగ్రాచులేషన్స్ విజయ్ గారు" అంటూ పోస్ట్ చేశారు. గత కొంతకాలంగా విజయ్ వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్లను ఉద్దేశించి ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

రాజకీయాలకు, వ్యక్తిగతానికి సంబంధం లేదు!

ఈ సందర్భంగా రాజకీయాలపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. "వ్యక్తిగత జీవితానికి, రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదు. ఒకవేళ వ్యక్తిగత జీవితంతోనే రాజకీయాలను ముడిపెడితే.. ఈ ప్రపంచంలో ఎవరూ రాజకీయాలు చేయలేరు" అని ఆమె స్పష్టం చేశారు. నాయకుడి వ్యక్తిగత విషయాల కంటే, ప్రజలకు చేసే సేవలే ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే దివ్వెల మాధురి పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వ్యక్తిగత విమర్శలను ప్రజలు పట్టించుకోరని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయని కొందరు విశ్లేషిస్తున్నారు. "తమిళనాడులో విజయ్ గెలిచినట్లుగానే, రేపు ఏపీలో దువ్వాడ శ్రీనివాస్ విజయం వెనుక కూడా మీరే కీలక పాత్ర పోషించాలి" అంటూ నెటిజన్లు ఆమె పోస్ట్‌పై కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి వ్యవహారం ఏపీలో ఇప్పటికే సంచలనంగా ఉన్న నేపథ్యంలో, తమిళనాడు ఫలితాలను ఉద్దేశించి ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story