- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్యాన్సర్‌తో పోరాడుతున్న హీరోయిన్.. అలాంటి అవతారంలో దర్శనమివ్వడంతో షాక్ అవుతున్న నెటిజన్లు
బుల్లితెర హీరోయిన్ హీనాఖాన్(Heenakhan) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర హీరోయిన్ హీనాఖాన్(Heenakhan) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘ఏ రిశ్తా క్యా కహ్లాతా హై’ ధారావాహికతో ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హిందీ బిగ్‌బాస్(Bigg Boss)లోనూ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా తన గేమ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో సినిమాల్లో నటించే చాన్స్ వచ్చింది. అలా కెరీర్ ఎంతో సాఫీగా గడిచిపోతున్న టైంలో క్యాన్సర్ బారిన పడింది. ఇక ఈ ఏడాది ప్రారంభంలోనే తాను బ్రెస్ట్ క్యాన్సర్ బారినపడ్డట్టు చెప్పి.. అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఒక పక్క కీమోథెరపీ చేయించుకుంటూనే.. అడపాదడపా కెరీర్‌కు సంబంధించిన ఈవెంట్లలోనూ మెరుస్తున్నది. ఇక రీసెంట్‌గా తన చిన్ననాటి స్నేహితుడైన రాకీను పెళ్లి చేసుకుంది.
అయితే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది ఈ చిన్నది. ఈ క్రమంలో అ అమ్మడు పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా హీనాఖాన్ తన ఇన్‌స్టా(Instagram)లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో నైట్ షూట్ ధరించి రెండు చిన్న పిలకలు వేసుకుని కనిపించింది. ఇక వీటికి.. ‘ఏడాదిన్నర తర్వాత నా జుట్టును పిగ్‌టెయిల్స్‌లో పెట్టాను.. నేను నా జుట్టుని తిప్పడం ఎంత మిస్ అయ్యానో మాటల్లో వివరించలేను.. వెయిటింగ్.. వన్ డే ఎట్ ఎ టైమ్.. ఉఫ్.. చిన్న చిన్న పిలకలు’ అంటూ రాసుకొచ్చింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఇన్ని రోజులు ఉన్నది రియల్ హెయిర్ కాదా విగ్ ఆ అని షాక్ అవుతున్నారు. అలాగే చాలా క్యూట్‌గా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.






