- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేకప్ లేకుండా దర్శనమిచ్చిన యంగ్ హీరోయిన్.. సో క్యూట్ అంటున్న నెటిజన్లు
‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukunduvate) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నభా నటేష్(Nabha Natesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, సినిమా: ‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukunduvate) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నభా నటేష్(Nabha Natesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ‘అదుగో’(adhugo) చిత్రంలో నటించినప్పటికీ అంతగా ఫేమ్ తెచ్చుకోలేక పోయింది. కానీ లవర్ బాయ్ రామ్ పోతినేని నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’(Ismart Shanker) మూవీతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.
అలా ‘డిస్కో రాజా’(disco Raja), ‘సోలో బ్రతుకే సో బెటర్’(Solo Brathuke so Better), ‘డార్లింగ్’(Darling) వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం నిఖిల్ సరసన ‘స్వయంభు’ మూవీలో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అందచందాలతో కుర్రకారుకు అందాల విందును వడ్డిస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా నభా నటేష్ తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది.
అందులో మార్నింగ్ లేవగానే ఉన్న ఫేస్‌తో సెల్ఫీస్ తీసుకుంది. అంతేకాకుండా వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఇక వాటికి.. ‘పెద్దగా ఏమీ లేదు సోదరా! కేవలం కొన్ని సెల్ఫీలు తీసుకుంటున్నాను. మీరు ఏమి చేస్తున్నారు?’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు సో క్యూట్ విత్ అవుట్ మేకప్ చాలా బాగున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ బ్యూటీ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.






