- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ పార్ట్‌కు సర్జరీ చేయించుకోనున్న ప్రభాస్ బ్యూటీ.. అవసరమా అంటున్న నెటిజన్లు
అలనాటి స్టార్ హీరోయిన్ త్రిష(Trisha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, సినిమా: అలనాటి స్టార్ హీరోయిన్ త్రిష(Trisha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘వర్షం’(Varsham) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. కానీ సడెన్‌గా ఏమైందో ఏమోకానీ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చి.. వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉంది. అలా ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మ చేతిలో దాదాపు 7 సినిమాలకు పైనే ఉన్నాయి.
అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అందంతో అదరహో అనిపిస్తుంది. అలాగే తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ అమ్మడుకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. సాధారణంగా హీరోయిన్స్ అందం విషయంలో చాలా కేరింగ్‌గా ఉంటారు. ఒకవేళ వాటికి సంబంధించిన విషయాల్లో ఏమైనా తేడా అనిపిస్తే సర్జరీలు చేయించుకుని మరింత అందంగా రెడీ అవుతారు.
అలా ఇప్పుడు త్రిష కూడా సర్జరీ చేయించు కాబోతుందట. ఏంటి నిజమా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ భామ లిప్స్‌పై ఎంతటి ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ వస్తాయో మనందరికీ తెలిసిందే. ఇక ఈ ట్రోలింగ్‌కి చెక్ పెట్టేందుకే ఈ బ్యూటీ తన పెదాలకు సర్జరీ చేయించుకోనుందట. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఇప్పుడు మీరు చాలా బాగున్నారు మళ్లీ ఈ సర్జరీ అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.






