పెళ్లి వద్దు కానీ పిల్లల్ని మాత్రం కనాలని ఉంది.. హీరోయిన్ బోల్డ్ కామెంట్స్ పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

by Gugulothu.Kavitha |   (  Updated:2025-06-25 09:01:07  IST  )

‘రావణాసుర’(Ravanasura) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరోయిన్ ఈడెన్ రోజ్(Edin Rose) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

పెళ్లి వద్దు కానీ పిల్లల్ని మాత్రం కనాలని ఉంది.. హీరోయిన్ బోల్డ్ కామెంట్స్ పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ‘రావణాసుర’(Ravanasura) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరోయిన్ ఈడెన్ రోజ్(Edin Rose) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. మాస్ మహరాజా రవితేజ(Raviteja) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఈ బ్యూటీ ఐటెం సాంగ్‌తో అలరించింది. తన అందంతో మెప్పించినప్పటికీ అంతగా అవకాశాలు రాలేదు. అయితే ఈ చిన్నది హీరోయిన్‌గా కంటే ఎక్కువ స్పెషల్ సాంగ్స్‌లోనే మెరిసింది. అయినప్పటికీ అంతగా ఫేమ్ కాలేకపోయింది. కానీ గత ఏడాది ‘బిగ్‌బాస్-18’లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌ అడుగుపెట్టి అక్కడ ఫుల్ ఫేమస్ అయింది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘ఇండియా క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్‌ను పిచ్చిగా ప్రేమిస్తున్నాను. అతడిని మనసులో నా భర్తగా అంగీకరించాను. అంతేకాకుండా అతడితో ఇద్దరు పిల్లలను కూడా ఊహించుకున్నాను. అయితే నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కానీ, పిల్లలను మాత్రం కనాలని ఉంది. అందుకే ఎగ్ ఫ్రీజ్ పద్దతి ఫాలో కావాలనుకుంటున్నాను’ అని బోల్డ్ కామెంట్స్ చేసింది. దీంతో ఈడెన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఇదేం చండాలం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story