రవితేజ ‘మాస్ జాతర’ మూవీలోని పాటలో బూతులు.. పొట్టు పొట్టుగా తిడుతున్న నెటిజన్లు

by I. Sairam |   (  Updated:2025-08-06 03:02:55  IST  )

మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja), టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీ లీల(Sreeleela) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’(Mass Jathara).

రవితేజ ‘మాస్ జాతర’ మూవీలోని పాటలో బూతులు.. పొట్టు పొట్టుగా తిడుతున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja), టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీ లీల(Sreeleela) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’(Mass Jathara). భాను భోగవరపు(Bhanu Bhogavarapu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ను శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ ఉర్రూతలూగించగా.. తాజాగా, ‘మాస్ జాతర’ నుంచి సెకండ్ సింగిల్ ‘ఓలే ఓలే’ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

అయితే ఈ పాటపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బూతులు ధ్వనించేలా నీ.. అమ్మని.. అక్కని అంటూ రచయిత భాస్కర్ యాదవ్ రెచ్చిపోయారని, ఆ పదాలు వినడానికి ఎబ్బెట్టుగా ఉన్నాయని, ఛీఛీ ఈ కాలంలో సాంగ్స్‌లో అన్ని బూతులే ఉంటున్నాయని తిట్టిపోస్తున్నారు. అయితే మరికొంత మంది మాత్రం మాస్ ఫ్యాన్స్‌ను దృష్టిలో ఉంచుకొని పాటలో ఆ లిరిక్స్ రాశారని అంటున్నారు.

Video Link

Next Story