- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tollywood : రాజమౌళిని ఎదుర్కొనే డైరెక్టర్ వచ్చేశాడంటూ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్
ఈ సినిమా డిసెంబర్ 5 న థియేటర్లలో రిలీజ్ అయింది.

దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun) హీరోగా, రష్మిక మందన్న( Rashmika Mandanna) హీరోయిన్ గా నటించిన సినిమా "పుష్ప 2" (Pushpa 2). సుకుమార్ ( Sukumar ) దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 5 న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రస్తుతం, "పుష్ప 2" మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను బ్రేక్ చేస్తుంది. ఫస్ట్ డే నుంచే సినిమా హిట్ టాక్ తో దూసుకువెళ్తుంది. వరల్డ్ వైడ్ గా రూ.294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఇండియన్ మూవీలో చరిత్ర సృష్టించి నార్త్ లో కూడా దూసుకెళ్తుంది.
నాలుగు రోజుల్లో ఈ సినిమా రూ. 829 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. అయితే, ఇప్పటివరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్స్ లిస్ట్ లో రాజమౌళి నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. మొన్నటి వరకు జక్కన్న ఢీ కొట్టే వాళ్ళు ఇంకా పుట్టలేదని అన్నారు. కానీ, పుష్ప 2 వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. ఈ సినిమాలో జాతర ఏపిసోడ్ చూసి రాజమౌళిని ఎదుర్కొనే డైరెక్టర్ వచ్చేశాడంటూ నెటిజెన్స్ సుకుమార్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.






