- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘అలా ఎలా తప్పుపట్టారు బ్రో.. బొట్టు పెట్టుకొని అంత పద్దతిగా ఉంటే’.. ప్రభాస్ హీరోయిన్‌పై ట్రోల్స్ ఆపాలని విజ్ఞప్తి

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లోని పెహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. పరస్పర ఆంక్షలతో ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే ఇండియాలో ఉన్న పాకిస్తానీలను ఆ దేశానికి తిరిగి పంపిస్తేస్తున్నారు. ఈనెల 27వ తేదీ వరకూ అవకాశం కల్పించారు. ఆలోపే వెళ్లిపోవాలని.. ఆ తర్వాత ఉండాలని చూస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాదు.. పాకిస్తానీ నటీనటులు ఉన్న సినిమాల విడుదలలపై కూడా ఆంక్షలు విధించారు. ఈ క్రమంలోనే రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) సినిమాలో నటిస్తున్న హీరోయిన్‌పై ట్రోల్స్ మొదలయ్యాయి.
ప్రభాస్ - హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో ఇమాన్వీ ఇస్మాయిల్(Imanvi Ismail) హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. అయితే.. ఆమె పాకిస్తానీ హీరోయిన్ అని.. వెంటనే ఆమెను మూవీ లోంచి తొలగించాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పెద్ద ఎత్తున డిమాండ్స్ చేశారు. దీనికి ఆమె స్పందిస్తూ.. తాను పాకిస్తాన్‌కు చెందిన నటిని కాదని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. ఉగ్రదాడిలో మృతిచెందిన వారికి సంతాపం సైతం ప్రకటించింది. నాకే కాదు.. నా కుటుంబంలోని ఎవరికీ పాకిస్తాన్‌తో సంబంధాలు లేవు. నేను భారత అమెరికన్‌ను అని గర్వంగా చెబుతాను. హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లిష్ మాట్లాడగలను. అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో పుట్టాను. నా తల్లిదండ్రులు అమెరికాకు వలసవెళ్లి.. అక్కడి పౌరులుగా మారారు. నేనూ అక్కడే పుట్టాను. అక్కడే చదివాను. అక్కడే కెరియర్ ప్రారంభించాను. భారత చిత్రపరిశ్రమలో కొనసాగుతున్నందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నాను. భారత సంస్కృతి నా రక్షంలోనే ఉంది’ అని ఇమాన్వీ చెప్పుకొచ్చింది.
అయితే.. తాజాగా ఈ వివాదంపై ప్రభాస్ ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. ఇమాన్వీకి మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. ప్రభాస్- హను సినిమా పూజా కార్యక్రమాలకు హాజరైన ఆమె ఫొటోలను వైరల్ చేస్తున్నారు. చక్కగా తెలుగింటి ఆడపడుచులా చీర కట్టుకొని, బొట్టు పెట్టుకొని వచ్చిన ఆమెను ఎలా అమానించాలని అనిపించింది బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అందరినీ అనుమానించడం సరికాదంటూ రియాక్ట్ అవుతున్నారు. ఆ సినిమా పూజా కార్యక్రమంలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. కాగా, ప్రభాస్ - హను కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం.. పీరియాడికల్ యాక్షన్ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇమాన్వీ ఎస్మాయిల్ కథానాయికగా నటిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీత అందిస్తున్నారు.
Ela tappu padutunaru ra asalu🥲
— Devaaa (@deva_devaratha) April 25, 2025
Bottu petukoni antha paddathi ga untey🥲 pic.twitter.com/GURXl1hWFG






