- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరో కంటే ఎక్కువ డబ్బులు ఇస్తాం.. ఒక్క రాత్రి గడుపు అంటూ నెటిజన్ల పోస్ట్.. సింగర్ రియాక్షన్ ఏంటంటే?
గత కొద్ది రోజుల నుంచి కోలీవుడ్ స్టార్ జయం రవి(Jayam Ravi), ఆర్తి విడాకులు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి కోలీవుడ్ స్టార్ జయం రవి(Jayam Ravi), ఆర్తి విడాకులు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. వీరిద్దరికీ కోర్ట్ ఇంకా డైవర్స్ మంజూర్ చేయకముందే జయం రవి సింగర్ కెనీషాతో(Kenisha Francis) డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు రావడంతో ఆర్తి నిత్యం పలు సంచలన పోస్టులు పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ విషయంపై కెనీషా, జయం రవి స్పందించి తాము ఫ్రెండ్స్ అని క్లారిటీ ఇచ్చినప్పటికీ పలు వార్తలు మాత్రం వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కెనిషాను కొంతమంది చంపేస్తామని బెదిరిస్తున్నట్లు సమాచారం. అలాగే మరికొందరు జయం రవి దగ్గర ఉన్న డబ్బుల కోసమే ఇలా చేస్తున్నావ్ కదా.. ఏ వేశ్య మా అన్నయ్య రూమ్‌కు కూడా వచ్చి ఒక రాత్రి గడుపు అంతకంటే ఎక్కువ డబ్బులు ఇస్తాడని దారుణంగా కామెంట్లు చేస్తున్నారు.
తాజాగా, ఈ విషయంపై ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించిన కెనిషా తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘మీ అందరి మాటలు, శాపాల వల్ల నేను ఎంత వేదన అనుభవిస్తున్నానో ఎవరైనా ఆలోచించారా? కర్మ ఎవరినీ విడిచిపెట్టదు అని దారుణంగా మాట్లాడుతున్నారు. అయితే త్వరలో నిజం బయటకు రావాలని నేను ఆశిస్తున్నా. కానీ అప్పుడు నాలాగా మీరు కూడా బాధపడాలని నేను అనుకోవడం లేదు. మీలో చాలామందికి నిజం తెలియకపోవడం వల్ల నన్ను నిందిస్తూ దారుణంగా మాట్లాడుతున్నారు. మీ అందరి భావాలను నేను అర్థం చేసుకున్నా. కానీ త్వరలో నిజం బయటపడాలిని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఒకవేళ తప్పు చేస్తే.. చట్టం వేసే శిక్షణను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నా.
అప్పటి వరకు నన్ను ప్రశాంతంగా బతకనివ్వండి. నేను నా కామెంట్ సెక్షన్ ఆఫ్ చేయలేదు. ఎక్కడికీ పారిపోలేదు.. మీ అందరి నుంచి ఏ విషయాన్ని దాచడం లేదు. నేనే చేసే పనులపై ప్రశ్నించే హక్కు మీకు ఉంది. ఏ విషయాన్ని అయినా నేరుగా నా ముఖంపై చెప్పండి. నా వెర్షన్‌ను వివరించడానికి సిద్ధంగా ఉన్నాను. అంతేకానీ నిజనిజాలు తెలుసుకోకుండా దారుణంగా అనకండి. నిజాలు చెప్పడం నాకుడా సంతోషమే. నా చుట్టూ జరుగుతున్న విషయాలకు నేను బాధ్యురాలిని అని మీరంతా భావిస్తే.. నన్ను కోర్టుకు ముందుకు తీసుకెళ్లండి’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు కొంతరు కెనిషాకు సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఆమె డ్రామాలు చేస్తుందని అంటున్నారు.






