- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త ఆలోచనతో నెట్‌ఫ్లిక్స్.. ఇకపై బాక్స్ ఆఫీస్ లెక్కలే ప్రధానం
కొత్త ఆలోచనతో నెట్‌ఫ్లిక్స్.. ఇక బాక్స్ ఆఫీస్ లెక్కలే కీలకం.

దిశ, వెబ్ డెస్క్: సినిమా విడుదలను ఓటీటీ సంస్థలు శాసిస్తున్నాయని గత కొంతకాలంగా అనేక మంది సినీ ప్రముఖులు చెబుతూ వస్తున్నారు. దీనికి ప్రధాన కారణంగా ఏదైనా సినిమా పూర్తయ్యాక కూడా ఓటీటీ డీల్ కుదరాలంటే వారు సూచించిన తేదీకే సినిమాను విడుదల చేయాలనే నిబంధన ఉండటం, అలాగే సంవత్సరానికి పరిమిత సంఖ్యలో మాత్రమే సినిమాలు కొనుగోలు చేస్తామని ఓటీటీ సంస్థలు నిర్ణయించుకోవడంతో అనేక చిత్రాలు డీల్ కుదరక విడుదల కాకుండా ఆగిపోతున్న పరిస్థితి ఏర్పడుతోంది.
అయితే మంచి అంచనాలు ఉన్న సినిమాలకు మాత్రం ముందుగానే ఓటీటీ డీల్స్ కుదురుతున్నాయి. భారీ ఎక్స్‌పెక్టేషన్స్ కలిగిన చిత్రాలను ముందుగానే అధిక ధరలకు కొనుగోలు చేసిన సందర్భాల్లో, ఆ సినిమాలు థియేటర్లలో పెద్దగా రాణించకపోతే డిజిటల్ సంస్థలకు పెద్దగా లాభం ఉండడం లేదు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఒక కొత్త విధానంతో ముందుకు రావాలని భావిస్తున్నట్లు సమాచారం. సినిమా విడుదలకు ముందే ఆ చిత్ర బృందంతో ఒప్పందం కుదుర్చుకుని, బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా సాధించే కలెక్షన్ల ఆధారంగా ఓటీటీ ధరను నిర్ణయించే విధానాన్ని అమలు చేయాలని ఆ సంస్థ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సంస్థ ‘స్వయంభు’ మూవీ బృందంతో ఇలాంటి ఒప్పందంపై చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే భవిష్యత్తులో అన్ని సినిమాల విషయంలో కూడా ఇదే విధానాన్ని కొనసాగించాలని ఆ సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధానం అమలులోకి వస్తే, బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలు సాధించిన సినిమాలకు పెద్ద స్థాయిలో ఓటీటీ డీల్స్ కుదిరే అవకాశం ఉంది. అదే సమయంలో సినిమా థియేటర్లలో విఫలమైతే, ఆ చిత్రానికి ఓటీటీ ద్వారా వచ్చే ఆదాయం కూడా తగ్గే పరిస్థితి ఏర్పడవచ్చు. ఈ మార్పులు అమలులోకి వస్తే ఇది సినీ పరిశ్రమకు మరో పెద్ద సవాల్‌గా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






