Akhanda 2 OTT : అఖండ 2 సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్‌..ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే

by velandi.Saikiran |

అఖండ 2 ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. ఈ నెల 9వ తేదీన డిజిటల్ రిలీజ్ ఉంటుందని తాజాగా చిత్ర బృందం వెల్లడించింది.

Akhanda 2 OTT : అఖండ 2 సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్‌..ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: నందమూరి బాలయ్య అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. నందమూరి బాలయ్య హీరోగా చేసిన అఖండ 2 సినిమా ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. అందరూ ఊహించినట్లుగానే ఈ నెల 9వ తేదీన డిజిటల్ రిలీజ్ ఉంటుందని తాజాగా చిత్ర బృందం వెల్లడించింది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ కూడా ధృవీకరించింది. దీంతో థియేటర్ లో చూడని వారు ఇప్పుడు ఓటీటీలో కూడా చూసే అవకాశం వచ్చింది.

కాగా నందమూరి బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అఖండ 2 సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. హిందూ, సనాతన ధర్మం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. దీంతో జనాలకు బాగా కనెక్ట్ అయింది అఖండ 2. ఈ తరుణంలో 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు చెబుతున్నారు. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి స్పెషల్ రోల్స్ లో కనిపించారు. కాగా ఈ మూవీ డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు ఓటీటీలోకి కూడా రానుంది.

Next Story