షూటింగ్ స్టార్ట్.. ఓటీటీ డీల్ క్లోజ్.. రిలీజ్‌కు ముందే భారీ హైప్ క్రియేట్ చేసిన కోర్టు హీరోయిన్ మూవీ

by Chukka Sudharani |

‘జో’, ‘కోళి ప‌న్నై చెల్ల‌దురై’ చిత్రాల ఫేమ్ ఏగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హైకూ’.

షూటింగ్ స్టార్ట్.. ఓటీటీ డీల్ క్లోజ్.. రిలీజ్‌కు ముందే భారీ హైప్ క్రియేట్ చేసిన కోర్టు హీరోయిన్ మూవీ
X

దిశ, సినిమా: ‘జో’, ‘కోళి ప‌న్నై చెల్ల‌దురై’ చిత్రాల ఫేమ్ ఏగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హైకూ’. ఈ త‌మిళ చిత్రం షూటింగ్ కేరళలోని ఇడుక్కి ప్రాంతంలో పూజా కార్యక్రమాలతో తాజాగా ప్రారంభమైంది. పేరన్బు, తరమణి వంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు రామ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. యువ‌రాజ్ చిన్నసామి దర్శకత్వంలో విజ‌న్ సినిమా హౌస్ బ్యాన‌ర్‌పై డా.డి.అరుళ‌నందు, మాథ్యూ అరుళ‌నందు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘మిన్నల్ మురళి’, ‘శేషం మైకిల్ ఫాతిమా’ వంటి చిత్రాల్లో మెప్పించిన ఫెమినా జార్జ్, అలాగే ‘కోర్ట్’ ఫేమ్ శ్రీదేవి అప్పళ్ల ఇందులో కథానాయికలుగా నటిస్తున్నారు. కాగా.. ‘హైకూ’ మరో విశేషం ఏంటేంటే.. సినిమా షూటింగ్ పూర్తికాక ముందే ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ హక్కులను ప్రపంచ స్థాయి ఓటీటీ దిగ్గజాల్లో ఒకటైన నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం విశేషం. ఈ విషయాన్ని నిర్మాతలు అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.

Next Story