ఇండిపెండెన్స్ డే స్పెషల్.. నేతాజీ మూవీ ట్రైలర్ విడుదల

by Gantepaka Srikanth |

దేశ భక్తులకు, సినీ ప్రియులకు మరో శుభవార్త రానే వచ్చింది.

ఇండిపెండెన్స్ డే స్పెషల్.. నేతాజీ మూవీ ట్రైలర్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ భక్తులకు, సినీ ప్రియులకు మరో శుభవార్త రానే వచ్చింది. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ జీవిత కథ ఆధారంగా రూపొందిస్తోందిన్న ఏఐ చిత్రం నుంచి మేకర్స్ ట్రైలర్‌(Netaji Movie trailer)ను విడుదల చేశారు. భారత స్టార్టప్ కంపెనీ ఐఏ టెక్నాలజీతో ఈ మూవీని తెరకెక్కిస్తోంది. బ్రిటిష్ నుంచి స్వాతంత్య్ర సాధనలో రష్యా సాయం కోసం వెళ్తుండగా నేతాజీ విమాన ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే ఆయన నిజంగానే చనిపోయారా? ఆ తర్వాత ఏం జరిగింది? వంటి అంతుచిక్కని అంశాలపై తెరకెక్కుతున్న ఈ మూవీ 2026 JAN 26న రిలీజ్ కానుంది. కాగా, ఇవాళ ఇండిపెండెన్స్ డే సందర్భంగా దేశ వ్యాప్తంగా సంబురాలు అంబరాన్ని అంటాయి. రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీలు త్రివర్ణ పతకాన్ని ఎగురవేసి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Next Story