విశ్వనాథ్ అండ్ సన్స్ నుంచి ‘నేనో బట్టర్ ఫ్లై’ సాంగ్స్..

by Chukka Sudharani |

డైనమిక్ సింగం సూర్య హీరోగా, మమితా బైజు కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.

విశ్వనాథ్ అండ్ సన్స్ నుంచి ‘నేనో బట్టర్ ఫ్లై’ సాంగ్స్..
X

దిశ, సినిమా: డైనమిక్ సింగం సూర్య హీరోగా, మమితా బైజు కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ & రొమాంటిక్ డ్రామా నుంచి ఇప్పటికే వచ్చిన పత్రీ అప్డేట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ అద్భుతమైన సంగీతం అందిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఆగస్టు 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతుండగా.. తాజాగా ఫస్ట్ సాంగ్‌ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘నేనో బట్టర్ ఫ్లై’ అంటూ సాగే ఈ సాంగ్‌లో మమిత చిలిపి తనం, సూర్య రియాక్షన్స్ రెండూ కలిపి ఆడియన్స్‌ను సరికొత్తగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా.. అదే రేంజ్‌లో ఇప్పుడు ‘నేనో బట్టర్ ఫ్లై’ పాటకు కూడా అద్భుతమైన స్పందన లభిస్తోంది.

Next Story