*సెన్సార్ సన్నాహాల్లో ‘నేనెవరు?’

by Sujitha Rachapalli |

నట కిరీటి డా.రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్ర పోషించిన హార్ట్ టచింగ్ చిత్రం ‘నేనెవరు?’. ‘నువ్వే కావాలి’, ‘ప్రేమించు’ చిత్రాల ఫేమ్ సాయి కిరణ్, జోగిని శ్యామల కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని చిరంజీవి తన్నీరు దర్శకత్వంలో జై చిరంజీవ ఫిల్మ్ మేకర్స్ పతాకంపై సరికొండ మల్లిఖార్జున్

*సెన్సార్ సన్నాహాల్లో ‘నేనెవరు?’
X

దిశ, సినిమా : నట కిరీటి డా.రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్ర పోషించిన హార్ట్ టచింగ్ చిత్రం ‘నేనెవరు?’. ‘నువ్వే కావాలి’, ‘ప్రేమించు’ చిత్రాల ఫేమ్ సాయి కిరణ్, జోగిని శ్యామల కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని చిరంజీవి తన్నీరు దర్శకత్వంలో జై చిరంజీవ ఫిల్మ్ మేకర్స్ పతాకంపై సరికొండ మల్లిఖార్జున్ సమర్పణలో అండేకర్ జగదీష్ బాబు , సకినాన భూలక్ష్మి సంయుక్తంగా నిర్మించారు. వైజాగ్ సత్యానంద్ శిష్యులు అభిలాష్ - సాయి చెర్రీ హీరోలుగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో దీపిక, సోనాక్షి హీరోయిన్లు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. తన కెరీర్‌లో చాలా గర్వంగా చెప్పుకునే చిత్రాల జాబితాలో "నేనెవరు?" నిలుస్తుందని ఈ చిత్రం టీజర్ రిలీజ్ వేడుకలో రాజేంద్రప్రసాద్ ప్రకటించిన నేపథ్యంలో... ఈ చిత్రానికి బిజినెస్ పరంగా క్రేజ్ పెరిగింది. విడుదల తేది త్వరలో ప్రకటిస్తామని నిర్మాత భూలక్ష్మి తెలిపారు. ఇక ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, మాటలు: శ్రీనివాస్ అంగిరెడ్డి, పాటలు: ఎస్.ఎస్.వీరు, కొరియోగ్రఫీ: అజయ్ క్రిష్ - సంతోష్, సంగీతం: చిన్నికృష్ణ, ఛాయాగ్రహణం: నాయుడు ప్రసాద్ కొల్లి, ఎడిటింగ్: నందమూరి హరి - నందమూరి తారకరామారావు.. తమ తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

Next Story