Neha Shetty: నేహా శెట్టికి స్పెషల్ విషెస్ చెప్పిన ‘టైసన్ నాయుడు’ మూవీ టీమ్.. పోస్టర్ వైరల్

by Hamsa |
Neha Shetty: నేహా శెట్టికి స్పెషల్ విషెస్ చెప్పిన ‘టైసన్ నాయుడు’ మూవీ టీమ్.. పోస్టర్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నేహా శెట్టి(Neha Shetty) ‘మెహబూబా’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత ‘రూల్స్ రంజన్(Rules Ranjan), బెదురు లంక వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక 2022లో ఈ అమ్మడు ‘డిజే టిల్లు’(DJ Tillu) సినిమాతో రాధిక పాత్రలో నటించి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అంతేకాకుండా సోషల్ మీడియా(Social Media)లోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ నిత్యం పలు హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లను ఫిదా చేస్తుంది. ఇటీవల ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి ’(Gang of Godavari)మూవీతో ప్రేక్షకులను అలరించింది.

ప్రస్తుతం నేహా శెట్టి, టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌(Bellamkonda Sai Srinivas) కాంబోలో ‘టైసన్ నాయుడు’(Tyson Naidu) రాబోతుంది. సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్(14 reels plus) బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికూ ‘టైసన్ నాయుడు’ (Tyson Naidu)నుంచి విడుదలైన అప్డేట్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో.. నేడు నేహా శెట్టి పుట్టినరోజు కావడంతో మేకర్స్ ఆమె లుక్ విడుదల చేస్తూ స్పెషల్ విషెస్ తెలిపారు. ఈ మేరకు ‘X’లో ఓ పోస్ట్ షేర్ చేశారు. ఇందులో వైట్ కలర్ డ్రెస్ ధరించిన ఆమె కూల్ లుక్‌లో అందరినీ మైమరిపిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed