- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చీరకట్టులో కుర్రాళ్ల మనసు దోచేస్తున్న నేహా శెట్టి
పట్టు చీరలో నేహా శెట్టి అందాలకు నెటిజన్లు ఫిదా

దిశ, వెబ్ డెస్క్: నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘మెహబూబా’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈమె ‘డీజే టిల్లు’ సినిమాతో అద్భుతమైన విజయంతో పాటు మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంది.
ఆ తర్వాత నుంచి ఈమెకు తెలుగులో వరుస అవకాశాలు దక్కుతున్నాయి. సినిమాల్లో ఎన్నో సందర్భాల్లో తన అందాలను ఆరబోసి వెండితెరపై సెగలు పుట్టించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తన హాట్ ఫోటోలతో కుర్రకారుకు గిలిగింతలు పెడుతూ వస్తుంది.
తాజాగా ఈమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో నేహా శెట్టి అదిరిపోయే ట్రెడిషనల్ లుక్‌లో కనిపించింది. పట్టు చీర కట్టుకుని, దానికి తగిన భారీ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న బ్లౌజ్ ధరించి స్టైలిష్‌గా ఫోజులు ఇచ్చింది.
ఇక నడుముకు వడ్డానం, మెడలో భారీ నెక్లెస్, చెవులకు పెద్ద ఇయర్ రింగ్స్ ధరించడంతో ఆమె అందం మరింత హైలెట్ అయింది. అలాగే నుదిటిపై పెట్టుకున్న చిన్న బొట్టు ఆమె ట్రెడిషనల్ లుక్‌కు మరింత ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చింది.
మొత్తంగా ప్రస్తుతం నేహా శెట్టి ట్రెడిషనల్ లుక్‌లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Photos Courtesy: Instagram






