Neha Shetty: హాట్ టిప్.. ఇది అప్లై చేయడంటూ టిల్లు హీరోయిన్ పోస్ట్ (వీడియో)

by Kodari Anjali |   (  Updated:2025-04-25 15:06:08  IST  )

హీరోయిన్ నేహా శెట్టి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే.

Neha Shetty: హాట్ టిప్.. ఇది అప్లై చేయడంటూ టిల్లు హీరోయిన్ పోస్ట్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ నేహా శెట్టి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. తన వ్యక్తిగత, వృత్తిపర విషయాలు నెట్టింట అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా ఈ టిల్లు బ్యూటీ.. తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికన ఓ పోస్ట్ పెట్టింది. పాండ్స్ సన్‌స్క్రీన్ ఫేస్ పౌడర్ గురించి ఓ యాడ్ చేసింది. ఈ వీడియోకు ఓ క్యాప్షన్ రాసుకొచ్చింది.

‘‘హాట్ టిప్: SPF అప్లై చేయడం వల్ల ఫేస్ క్లీన్‌గా ఉంటుంది. కాగా ఫేస్‌కు అప్లై చేయండి. పాండ్స్ సన్‌స్క్రీన్ ఫేస్ పౌడర్‌ను మీ చర్మానికి వేసవిలో మేలు చేస్తుంది. సూర్యరశ్మి నుంచి మీ ముఖాన్ని కాపాడుతుంది కూడా. జస్ట్ డబ్ డబ్ & డన్!’’ అంటూ నేహా శెట్టి రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ యాడ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇకపోతే నేహాశెట్టి మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. సిద్ధు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు సినిమాలో నటించి మరింత క్రేజ్ సొంతం చేసుకుంది నేహా శెట్టి. తర్వాత ఈ బ్యూటీ.. రూల్స్ రంజన్, బెదురులంక, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, టిల్లు స్క్వేర్ వంటి సినిమాల్లో నటించి జనాల్ని మెప్పించింది.

Next Story