- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Neha Shetty: ఓజీలో నేహాశెట్టి కన్ఫర్మ్.. అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన హీరోయిన్
పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సినిమాల్లో ఓజీ ఒకటి.

దిశ, సినిమా: పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సినిమాల్లో ఓజీ ఒకటి. పవన్ కల్యాణ్, సుజిత్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే.. ఈ మూవీలో టిల్లు బ్యూటీ నేహా శెట్టి ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్లు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు దీనిపై హీరోయిన్ కానీ చిత్ర బృందం కానీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న నేహా శెట్టి.. ‘నా తదుపరి చిత్రాలు త్వరలో నేను అనౌన్స్ చేస్తాను.. అలాగే మీ కోసం ఓజీలో ఓ సర్‌ప్రైజ్ ఉంది. మీరందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా’ అని తెలిపింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.






