కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్న మెగా బ్యూటీ..

by Bhoopathi Nagaiah |   (  Updated:2025-08-21 11:18:03  IST  )

యంగ్ హీరోయిన్ నేహా శర్మ(Neha Sharma) ‘చిరుత’ (chirutha)సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్న మెగా బ్యూటీ..
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ నేహా శర్మ(Neha Sharma) ‘చిరుత’ (chirutha)సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత వరుణ్ సందేశ్(Varun Sandesh) సరసన ‘కుర్రాడు’ చేసి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. కానీ టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్కడు పలు సినిమాల్లో నటించిన నేహాశర్మ ఊహించినంత ఫేమ్ రాబట్టుకోలేకపోయింది. చివరగా ‘జోగిరా సారా రారా’ మూవీలో నటించింది. ఇక ఆ తర్వాత నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం పలు హాట్ ఫొటోలు షేర్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. నేహా శర్మ డైరెక్టర్‌గా మారబోతున్నట్లు గత కొద్ది కాలంగా పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గన్ నిర్మిస్తోన్న పీరియాడిక్ చిత్రాన్ని నేహా తెరకెక్కించనున్నట్లు టాక్. 1945 బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ నేపథ్యంలో ఈ చిత్రంలో సిద్ధాంత్ చతుర్వేది, మోహిత్ రైనా ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. నేహాశర్మ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు సక్సెస్ అవ్వాలని నేహాశర్మకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

Next Story