- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘త్రిబాణధారి బార్భరిక్’ నుంచి నీవల్లే సాంగ్ రిలీజ్.. తన వాయిస్‌తో మెస్మరైజ్ చేసిన సిద్ శ్రీరామ్
ఈ మధ్యకాలంలో యూనిక్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమాలు ఆడియెన్స్ మెప్పు పొందుతున్నాయి.

దిశ, సినిమా: ఈ మధ్యకాలంలో యూనిక్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమాలు ఆడియెన్స్ మెప్పు పొందుతున్నాయి. నయా దర్శకనిర్మాతల థాట్స్, ప్రెజెంటేషన్ నేటితరం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతోంది. ఇదే బాటలో ‘త్రిబాణధారి బార్భరిక్’ (Tribanadhari Barbarik)అంటూ సరికొత్త పాయింట్‌తో రాబోతోన్నారు దర్శకుడు మోహన్ శ్రీవాత్స. ఇందులో సత్యరాజ్(Sathyaraj), వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను,సత్యం రాజేష్, క్రాంతి కిరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా విజయ్ పాల్ రెడ్డి(Vijay Pal Reddy) అడిదల నిర్మిస్తున్న ‘బార్బరిక్’ మూవీని వానర సెల్యూలాయిడ్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, మోషన్ పోస్టర్, గ్లింప్స్, టీజర్ ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్ పెంచగా.. తాజాగా నీవల్లే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటకు రఘురాం అందించిన లిరిక్స్, సిద్ శ్రీరామ్ సింగింగ్ మేజర్ హైలైట్ అయ్యాయి. సాంగ్ లో కనిపిస్తున్న సీన్స్ యూత్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. విడుదల చేసిన కాసేపట్లోనే ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక సిద్ శ్రీరామ్ వాయిస్ అందరినీ మంత్రముగ్దులను చేస్తుందనడంతో అతిశయోక్తి లేదు. కాగా, ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తోంది చిత్రయూనిట్.






