Jabilamma Neeku Antha Kopama:‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ రిలీజ్ డేట్ ఫిక్స్ .. ట్వీట్ వైరల్

by Kavitha |   ( Updated:2025-01-18 13:02:52.0  )
Jabilamma Neeku Antha Kopama:‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ రిలీజ్ డేట్ ఫిక్స్ .. ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: స్టార్ హీరో ధనుష్(Dhanush) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూడో సినిమా ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ (Jabilamma Neeku Antha Kopama). ఈ చిత్రంలో పవిష్(Pavish) హీరోగా అనిఖా సురేంద్రన్(Anikha Surendran) హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే వండర్‌బార్ ఫిల్మ్స్ పతాకంపై ధనుష్, కస్తూరి రాజా(Kasthuri Raja) నిర్మిస్తున్న ఈ చిత్రం లవ్ అండ్ కామెడీ ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్‌గా రూపొందుతోంది. ఇక స్టార్ డైరెక్టర్ జి వి ప్రకాష్ కుమార్(Gv Prakash Kumar) ఈ మూవీకి సంగీతం అందించారు. అయితే ఇప్పటికీ ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకుని మూవీ పై మరింత హైప్ పెంచేశాయి. దీంతో ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీ ఫిబ్రవరి 21న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed