వేట ప్రారంభించిన బాలయ్య.. ఫస్ట్ లుక్ అద్దిరిపోయింది

by Web Desk |
వేట ప్రారంభించిన బాలయ్య.. ఫస్ట్ లుక్ అద్దిరిపోయింది
X

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి నటసింహం బాలకృష్ణ జోరు పెంచాడు. 'అఖండ' అఖండ విజయం తర్వాత వరుస సినిమాలు లైన్‌లో పెట్టాడు. ఇందులో భాగంగానే బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబోలో ఓ పవర్ ఫుల్ మూవీ రెడీ అవుతోంది. ఇది NBK107 గా ప్రచారం అవుతోంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఇందులో బాలయ్య పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నాడు. ఈ ఫస్ట్ లుక్‌లో కారు పక్కనే బాలయ్య బ్లాక్ షర్ట్, లుంగీలో పక్కా మాస్ స్వాగ్‌తో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్‌పై 'హంట్ బిగిన్స్' అని రాశారు. దీంతో ఈ మూవీతో బాలయ్య బాక్సాఫీస్‌ను మరోసారి వేటాడనున్నాడంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ బాలయ్య పాత్ర ఏంటనేది మాత్రం ఇంకా మిస్టరీగానే ఉంది. మరి త్వరలో ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.


Next Story

Most Viewed