ఫైనల్‌గా తప్పుకున్న నయనతార.. సెట్‌లోకి కాజల్!

by Chukka Sudharani |

నందమూరి నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో NBK 111 రాబోతున్న విషయం తెలిసిందే.

ఫైనల్‌గా తప్పుకున్న నయనతార.. సెట్‌లోకి కాజల్!
X

దిశ, సినిమా: నందమూరి నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో NBK 111 రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాగా.. అప్డేట్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇందులో భాగంగానే ఈ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంది. మొదట ఇందులో హీరోయిన్‌గా నయనతారను ఫిక్స్ చేసినట్లు వార్తలు రాగా.. తర్వాత కాజల్ అగర్వాల్ పేరు గట్టిగా వినిపించింది. అయితే.. తాజాగా ఫిలిమ్ సర్కిల్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఇందులో కాజల్ ఆల్మెస్ట్ కన్ఫర్మ్ అని తెలుస్తుంది. అంతే కాకుండా.. కాజల్ అగర్వాల్ ఈరోజు నుండి షూట్‌లో జాయిన్ అవుతున్నట్లు టాక్ వస్తుండగా.. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. అయితే.. ఇప్పటికే బాలకృష్ణ, కాజల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. సూపర్ కాంబినేషన్ రిపీట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Next Story