NBK 111: 30 శాతం పూర్తయిన షూటింగ్.. రిలీజ్ విషయంలో హిట్ ఫార్ములాను ఫాలో కానున్న గోపీచంద్ మలినేని

by Pulgam srinivas |

‘NBK 111’ చిత్రాన్ని ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

NBK 111: 30 శాతం పూర్తయిన షూటింగ్.. రిలీజ్ విషయంలో హిట్ ఫార్ములాను ఫాలో కానున్న గోపీచంద్ మలినేని
X

దిశ, వెబ్ డెస్క్: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఇంకా అధికారిక టైటిల్ ఖరారు కాకపోవడంతో, ప్రస్తుతం ‘NBK 111’ అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ మూవీ షూటింగ్‌ సుమారు 30 శాతం పూర్తైనట్లు సమాచారం. మిగిలిన భాగాన్ని కూడా వేగంగా పూర్తి చేసి ఈ సినిమాను ఈ ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ దసరా సందర్భంగా విడుదలై మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో ‘NBK 111’ కూడా అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ దసరా బరిలోకి దిగితే భారీ విజయాన్ని అందుకునే అవకాశాలు ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, నర్గీస్ ఫక్రీ స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.

Next Story