- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nazriya Nazim: అల్లుఅట్లీ మూవీలో అల్లు అర్జున్‌కు చెల్లెలుగా క్రేజీ హీరోయిన్.. షాక్ అవుతున్న ఫ్యాన్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘AA-22’.

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘AA-22’. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ నుంచే దీనిపై ఫ్యాన్స్‌లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. దీనిని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా.. ఈ సినిమాలో వర్క్ చేసే నటీనటుల దగ్గర నుంచి టెక్నీషియన్స్‌కు వరకు ఏ ఒక్కరికి సంబంధించిన అప్‌డేట్ కూడా రాలేదు. ఈ క్రమంలోనే ‘AA-22’కు సంబంధించి నిత్యం ఏదో ఒక న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంది.
ఇప్పటికే ఇందులో హీరోయిన్స్ నటిస్తున్నట్లు మృణాళ్ ఠాకూర్, జాన్వీ కపూర్, దీపికా పదుకునే, అనన్య పాండే పేర్లు వినిపించగా.. వీటిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం రాలేదు. ఇప్పుడు ఈ సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలు క్యారెక్టర్‌లో క్రేజీ హీరోయిన్ నజ్రీయా నజీమ్ (Nazriya Nazim) నటిస్తునట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో.. పుష్పలో ఫహద్ ఫాసిల్ విలన్.. ఇప్పుడు ఈ సినిమాలో ఆయన భార్య నజ్రీయా సిస్టర్ క్యారెక్టర్ సూపరో సూపర్ అని అంటున్నారు నెటిజన్లు. అయితే.. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.






