- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిరంజీవితో ఘాటు రొమాన్స్...ఆ హీరోయిన్ కు 18 కోట్లా..?
మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పటివరకు 150కి పైగా సినిమాలు చేసిన మెగాస్టార

దిశ వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పటివరకు 150కి పైగా సినిమాలు చేసిన మెగాస్టార్ చిరంజీవి... త్వరలోనే.. సక్సెస్ దర్శకుడు అనిల్ రావిపూడితో ( Anil Ravipudi ) సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక అప్డేట్ వచ్చేసింది. విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా తరహా లోనే ఫ్యామిలీ అలాగే కామెడీ ఉండేలా... చిరంజీవి సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి.
అయితే ఇప్పటి వరకు ఈ సినిమాలో... నటించబోయే హీరోయిన్ మాత్రం ఫైనల్ కాలేదు. ఈ సినిమాలో... మొదట త్రిష, ఐశ్వర్య రాజేష్ చాలామందిని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఫైనల్ గా లేడీ సూపర్ స్టార్ నయనతారను ( Nayanatara) ఫైనల్ చేసినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ వార్త చెక్కర్లు కొడుతోంది. అంటే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తో నయనతార రొమాన్స్ చేయబోతుందన్నమాట. ఈ మేరకు నయనతారను సంప్రదించిందట చిత్ర బృందం. ఈ సందర్భంగా ఈ సినిమా కోసం ఏకంగా 18 కోట్లు అడిగిందట హీరోయిన్ నయనతార.
ప్రస్తుతం నయనతారకు దేశవ్యాప్తంగా... మంచి పాపులారిటీ ఉంది. పెళ్లి చేసుకున్న తర్వాత 10 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుంది నయనతార. అందుకే ఇప్పుడు హీరో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించేందుకు కూడా 18 కోట్లు డిమాండ్ చేస్తుందట. అయితే.. నయనతార డిమాండ్ చేస్తున్న రెమ్యూనరేషన్ ను ఇచ్చేందుకు కూడా చిత్ర బృందం రెడీ అయినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతున్నట్లు సమాచారం అందుతోంది. కాగా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార ఉన్న సంగతి తెలిసిందే.






