సొగసుచూడతరమా.. ఆ స్టార్ హీరోయిన్ చేతుల మీదుగా తెలుసు కదా సెకండ్ సింగిల్

by Chukka Sudharani |

సిద్దు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశిఖన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తెలుసు కదా’.

సొగసుచూడతరమా.. ఆ స్టార్ హీరోయిన్ చేతుల మీదుగా తెలుసు కదా సెకండ్ సింగిల్
X

దిశ, సినిమా: సిద్దు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశిఖన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తెలుసు కదా’. వైవా హర్ష కీలక పాత్రలో కనిపించబోతున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను నీరజ కోన దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, టీజీ కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ‘మల్లికగంధ’ ఆకట్టుకోగా.. తాజాగా సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘తెలుసు కదా సెకండ్ సింగిల్ ‘సొగసుచూడతరమా’ సెప్టెంబర్ 23న ఉదయం 11.07 గంటలకు రాబోతున్నది. లేడీ సూపర్ స్టార్ నయనతార డిజిటల్ వీడియో సాంగ్‌ను సూపర్ లాంచ్ చేయబోతున్నారు’ అని పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా తమన్ సంగీతం అందిస్తుండగా.. అక్టోబర్ 17 నుంచి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. లింక్


Next Story