- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nayanthara : మరో సినిమా ప్రకటించిన నయనతార.. ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్
by Chukka Sudharani |
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం ‘మన శంకరవరప్రసాద్’ సినిమాతో బిజీగా ఉంది.

X
దిశ, సినిమా: లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం ‘మన శంకరవరప్రసాద్’ సినిమాతో బిజీగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇది వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇలా ప్రజెంట్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయన్.. తాజాగా ఓ తమిళ చిత్రాన్ని ప్రకటించింది. నయనతార, కవిన్ జంటగా నటిస్తున్న ‘హాయ్’ మూవీకి విష్ణు ఎవడన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఇందులో నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది ఈ హీరోయిన్. ‘హాయ్ ఫస్ట్ లుక్.. హాయ్ చెప్పండి’ అంటూ విడుదల చేసిన పోస్టర్‌లో నయనతార అండ్ కవిన్ క్యూట్ లుక్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ సినిమాకు సంబంధించి మరన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్. link
- Tags
- Nayanthara
- Hi
Next Story






