- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nayanatara: టాలీవుడ్‌లో ఆ హీరో ఎంతో స్పెషల్.. అతను లేకుంటే కెరీర్ కష్టంగా ఉండేది
నయనతార మాట్లాడుతూ… తెలుగు సినిమా పరిశ్రమలో తన మొదటి హీరో వెంకటేష్ అని, ఆయనపై తనకు ఎంతో అభిమానం ఉందని పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమిళ చిత్రాల ద్వారా కెరీర్‌ను ప్రారంభించిన ఆమె, తెలుగులో కూడా స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. 2006లో విడుదలైన ‘లక్ష్మీ’ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి తొలి సినిమాతోనే మంచి విజయం మరియు గుర్తింపును సంపాదించుకుంది. తాజాగా నయనతార ఓ ఇంటర్వ్యూలో పాల్గొని టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ, “తెలుగు సినిమా పరిశ్రమలో వెంకటేష్ గారిపై నాకు చాలా అభిమానం ఉంది. నేను ఆయన హీరోగా నటించిన లక్ష్మీ సినిమాతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాను.
తెలుగులో ఆయనే నా మొదటి హీరో. ఆ సమయంలో నేను కొత్త హీరోయిన్, ఆయన అప్పటికే పెద్ద స్టార్ హీరో. అయినప్పటికీ ఆయన ఎప్పుడూ స్టార్ అనే భావనను చూపించలేదు. సెట్లో అందరితో ఎంతో సరదాగా ఉండేవారు. నటన విషయంలో కూడా సహాయం చేసేవారు” అని నయనతార తెలిపారు. వెంకటేష్ – నయనతార కాంబినేషన్‌లో లక్ష్మీ తర్వాత తులసి, బాబు బంగారం వంటి సినిమాలు వచ్చాయి. తాజాగా చిరంజీవి – నయనతార జంటగా రూపొందుతున్న మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో కూడా వెంకటేష్ కీలక పాత్రలో నటించారు. ఇలా వీరి కాంబినేషన్‌లో ఇప్పటివరకు అనేక సినిమాలు ప్రేక్షకులను అలరించాయి.






