64 ఏళ్ల తెలుగు హీరోతో న‌య‌న‌తార కొత్త సినిమా ?

by velandi.Saikiran |   (  Updated:2025-12-07 10:05:53  IST  )

మన శంకర వరప్రసాద్‌గారు సినిమాలో న‌య‌న‌తార హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ సినిమాలో అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోంది.

64 ఏళ్ల తెలుగు హీరోతో న‌య‌న‌తార కొత్త సినిమా ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: సౌత్ ఇండియాలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న నయనతార గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. లేడీ సూపర్ స్టార్ గా బిరుదు తెచ్చుకున్న నయనతార, 2003 నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక తెలుగులో విక్టరీ వెంకటేష్ నటించిన లక్ష్మి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే అలాంటి నయనతార, ఇప్పుడు కాస్ట్లీ హీరోయిన్ గా మారిపోయారు. ఆమె ఏ సినిమా ముట్టుకున్న 10 కోట్ల రెమ్యూన‌రేష‌న్ ఇవ్వాల్సిందేన‌ట‌.

కాగా, చిరంజీవి హీరోగా వ‌స్తున్న మన శంకర వరప్రసాద్‌గారు సినిమాలో న‌య‌న‌తార హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ సినిమాలో అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి వ‌చ్చిన పాట‌లు స‌క్సెస్ అయ్యాయి. 2026 సంక్రాంతి కానుగా మన శంకర వరప్రసాద్‌గారు సినిమా రిలీజ్ కానుంది. అయితే, ఈ ప్రాజెక్ట్ త‌ర్వాత విక్ట‌రీ వెంకీ మామ సినిమాలో ఓ స్పెష‌ల్ రోల్ చేయ‌నున్నార‌ట న‌య‌న‌తార‌. సంక్రాంతి వ‌స్తున్నాం 2 సినిమా 2027 సంక్రాంతికి రానున్న‌ట్లు టాక్‌. ఇందులో ఇప్ప‌టికే ఇద్ద‌రు హీరోయిన్లు ఉన్నారు. ఇక ఇప్పుడు న‌య‌న‌తార కూడా గెస్ట్ రోల్ చేయ‌నున్నార‌ట‌. ఈ మేర‌కు అనిల్ చ‌ర్చ‌లు కూడా జ‌రిపార‌ట‌.

READ MORE ....

20 ఏళ్లు అయినా వాటిని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను.. నయనతార షాకింగ్ కామెంట్స్!

Next Story